పృథ్వీ సారీ చెప్పిన జాలిపడని వైసీపీ క్యాడర్.. #DisasterLaila మొదలెట్టారు

పృథ్వీ సారీ చెప్పిన జాలిపడని వైసీపీ క్యాడర్.. #DisasterLaila మొదలెట్టారు

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్- వైసీపీ అభిమానుల మధ్య మొదలైన వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో వేసిన సెటైర్లపై పృథ్వీ క్షమాపణలు చెప్పినప్పటికీ, క్యాడర్ మాత్రం శాంతించడం లేదు. క్షమాపణలు స్వీకరించామని చెప్తూనే.. #DisasterLaila అంటూ కొత్త ట్వీట్లు వేస్తున్నారు. 

తప్పయ్యింది క్షమించండి..

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో 11 మేకల కామెంట్లతో వైసీపీ క్యాడర్‌కు టార్గెట్ అయిన పృథ్వీరాజ్.. గురువారం(ఫిబ్రవరి 13) క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. సినిమా నటుడిగా గోదారి జిల్లాలో పెరిగా కాబట్టి మాకు వెటకారం అనేది వెన్నతో పెట్టిన విద్య.. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా ద్వేషం లేదు.. సినిమాను సినిమాగా చూడండి.. బాయ్‌కాట్ లైలా(#BoycottLaila ) వద్దు.. వెల్కమ్ లైలా అనండి.. వాలెంటైన్స్‌డేకి లైలా వస్తుంది.. కనుక అందరూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయండి. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే, వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నానని వీడియోలో పేర్కొన్నారు.

తొక్క తీస్తాం ఒకొక్కడిది..!

పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పింది వాస్తవమైనా.. మనస్ఫూర్తిగా చెప్పలేదన్నది వైసీపీ అభిమానుల వాదన. భయం పుట్టించాం. ది గ్రేట్ YSRCP సోషల్ మీడియా! తొక్క తీస్తాం ఒకొక్కడిది!.. అని డైలాగులు చెప్తూ #DisasterLaila పేరుతో ట్వీట్లు మొదలు పెట్టారు. మరోవైపు చూస్తే, సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కావాల్సి ఉంది.