రాయికల్​ మున్సిపల్‌‌‌‌లో వీగిన అవిశ్వాసం

రాయికల్, వెలుగు: రాయికల్​ మున్సిపల్​లో కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శుక్రవారం రాయికల్​ మున్సిపల్​ కార్యాలయంలో ఆవిశ్వాసంపై  కలెక్టర్​ ఆదేశాలతో జగిత్యాల ఆర్డీఓ నర్సింహమూర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ కౌన్సిలర్లు 8 మంది ఇటీవల చైర్మన్​ మోర హన్మండ్లు, వైస్​ చైర్​పర్శన్​ గండ్ర రమాదేవిలపై ఆవిశ్వాసం పెట్టేందుకు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందించారు.

 కలెక్టర్​ కౌన్సిలర్లందరిని ఈ నెల 16న హజరుకావాలని నోటీసులు అందించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సమావేశం నిర్వహించగా కాంగ్రెస్​ కౌన్సిలర్​ మ్యాకల అనురాధ, బీజేపీ కౌన్సిలర్​ కల్లెడ సునీత  మాత్రమే హాజరయ్యారు. మిగతా ఎనిమిది మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్లు హజరు కాకపోవడంతో కౌన్సిలర్లు పెట్టిన ఆవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీఓ నర్సింహమూర్తి తెలిపారు.