- షాపింగ్‌కు వేళాయె!
- ఈ వారంలోనే ఫెస్టివల్ సేల్స్ ప్రకటించిన అమెజాన్,
- కార్డుల ద్వారా కొంటే రూ.2,500 వరకు డిస్కౌంట్
- ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, అజియో, ఈఎంఐ, ఎక్స్చేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్సైట్లకు ఫెస్టివల్ సీజన్ చాలా ముఖ్యం. వీటి ఆదాయంలో ఎక్కువ భాగం ఫెస్టివల్స్ సేల్స్ నుంచే ఉంటుంది. మనదేశంలో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పండుగలు ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ మంది దుస్తులు, ఎలక్ట్రానిక్స్,నగలు వంటివి కొంటారు కాబట్టే షాపింగ్ సైట్లు తొమ్మిదో నెల నుంచి ఫెస్టివల్స్ సేల్స్ మొదలుపెడుతాయి. పోయిన సంవత్సరం కంటే ఈసారి మరింత ఆదాయం సంపాదించాలని టార్గెట్‌తో ఇవి ఆఫర్లను గుమ్మరిస్తున్నాయి. ఫాస్ట్ డెలివరీ కోసం పెద్ద ఎత్తున స్టాఫ్‌ను తీసుకున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
సేల్ ఈనెల 23 నుంచి మొదలవుతుంది. కొన్ని బ్రాండ్ల ప్రొడక్టులపై ఇప్పటికీ డిస్కౌంట్లు ఇస్తోంది. సేల్ మొదలయ్యాక స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్ అప్లయెన్సెస్, టీవీలు, కిరాణా సామాగ్రి వంటి ప్రొడక్టులపై ఆఫర్లు ఉంటాయి. సేల్ సమయంలో శామ్సంగ్, ఐకూ, ఎల్జీ, షావోమీ, యాపిల్, సోనీ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లతో సహా 2,000లకుపైగా ప్రొడక్టుల లాంచ్‌లు ఉంటాయి. ఎస్బీఐ కార్డుతో కొంటే పది శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అమెజాన్ ఐసీఐసీఐ కార్డుతో కొంటే ఐదుశాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
అమెజాన్ సేల్ మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్,కిరాణా, ఫర్నిచర్ వంటి ప్రొడక్టులపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. వివిధ కేటగిరీల్లో 130 బిగ్ బిలియన్ డేస్ స్పెషల్ లాంచ్‌లు ఉంటాయి. కొన్ని బ్రాండ్ల ప్రింటర్లు, మానిటర్లు టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్స్, ఎర్లీ బర్డ్ స్పెషల్, రష్ అవర్స్ టిక్ టాక్ డీల్స్‌తో సహా పలు ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. బ్యాంక్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ , పే లేటర్ ఆప్షన్‌లను పొందవచ్చు.
డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. అర్హులైన కస్టమర్లు రూ. లక్ష వరకు క్రెడిట్‌తో ‘బై నౌ పే లేటర్ ఆప్షన్’ను కూడా ఉపయోగించవచ్చు. పేటీఎం యూపీఐ ద్వారా రూ. 250, అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే రూ. 25 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తారు. రూ. 500, అంతకంటే ఎక్కువ కొంటే రూ. 50 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు 10శాతం వరకు ఇన్స్టంట్డిస్కౌంట్ను పొందవచ్చు. మ్యాగ్జిమమ్ డిస్కౌంట్ రూ.1,500. ఆన్లైన్ ఫ్యాషన్ రీటెయిలర్ ఆజియో హౌస్ కూడా ఫెస్టివల్ సేల్కు తెర తీసింది. ఇది సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీ వరకు ఉంటుంది.