వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్ స్కేప్ లో Jio X1 5G లాంచ్ కోసం స్మార్ట్ ఫోన్ ప్రియలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Jio ఇప్పటివరకు అందించిన వాటికంటే అత్యంత చౌకైన 5G స్మార్ట్ ఫోన్. అద్భుతమైన 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, 128GB స్టోరేజ్ తో సహా ఆధునాతన ఫీచర్లతో మార్కెట్ అంచనాలను మించి ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకసారి Jio X1 5G హ్యాండ్ సెట్ అసాధారణ ఫీచర్లను పరిశీలిద్దాం.
Jio X1 5G ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు.. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు రూపొందించిన టెక్నాలజీ వండర్. దీని ప్రత్యేకతలు..
- RAM , స్టోరేజ్ : 8GB+128GB, 16GB వరకు విస్తరించదగిన RAM, అదనపు స్టోరేజ్ కోసం అదనపు SD కార్డ్ మద్దతు ఉటుంది.
- బ్యాటరీ లైఫ్ : 120W వేగవంతమైన ఛార్జింగ్ కు మద్దతు నిచ్చే బలమైన 5600mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతున్న ఈ డివైజ్ మృదువైన, సహజమైన కస్టమర్ల ఇంటర్ ఫేస్ ను అందిస్తుంది.
- డిస్ ప్లే: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో భద్ర పరిచిన స్మూత్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన పెద్ద 6.72 అంగుళాల IPS LCD డిస్ ప్లే ఉంటుంది.
- కెమెరా నాణ్యత : ఈ స్మార్ట్ ఫోన్ లో 64MP+8MP+2MP మెగాపిక్సెల్ తో బ్యాక్ కెమెరా సెటప్, హై రిజల్యూషన్ 32MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది.
- కనెక్టివిటీ ఆప్షన్ల: 2G, 3G, 4G,5G నెట్ వర్క్ లకు ఈ హ్యాండ్ సెట్ సంపూర్ణ మద్దతు నిస్తుంది.
- ప్రాసెసర్ : వేగవంతమైన , సమర్థవంతమై పనితీరు కోసం Media Tek డైమెన్సిటీ7020(5nm) ప్రాసెసర్ ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.
Jio X1 5G.. 5G టెక్నాలజీతో అత్యాధునిక టెక్నాలజీ, అధునాతన ఫీచర్లతో దేశీయ మార్కెట్లోకి అత్యంత తక్కువ ధరలో రాబోతుంది. త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది జియో.