రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాది హామి కూలీ పనుల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావ్ పేటలో ఉపాధి హామీ కూలీలు ఈరోజుకు ఎప్పటిలాగే పనికి వెళ్లారు. గుంత తవ్వుతున్న వారిపై మట్టి పెళ్లలు కూలిపోయి గుంతలో ఉన్న నలుగురిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మరుపాక రాజవ్వ(55) అనే మహిళ మృతి చెందింది.
కర్నాల లహరి, పల్లం దేవవ్వ, పల్లం రాజవ్వతో పాటు మరికొంత మందికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.