- ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజు
పద్మారావునగర్, వెలుగు : బాల్య వివాహ నిషేధ చట్టం-2006ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి ఇటీవల చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలు చరిత్రాత్మకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజు కోరారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి మంగళవారం ఆయన బోయిగూడ ఆశ్రిత ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బాల్య వివాహా నిషేధ చట్టం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 43 బాల్య వివాహాలను అడ్డుకొని, చైల్డ్వెల్ఫేర్అధికారులు, పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. జననీ ఫౌండేషన్ చైర్మన్ రాచకొండ మల్లేశ్, పీపుల్ హెల్పింగ్ చిల్ర్డన్స్ సంస్థ డైరెక్టర్ బి.సంతోశ్, రంగస్థల నటులు కబీర్, రెయిన్బో ఫౌండేషన్ ప్రెసిడెంట్ క్రాంతికిరణ్, ఆశ్రయ బాల తేజస్సుసంస్థ డైరెక్టర్నవీన్ రాజు, ప్రోగ్రామ్ మేనేజర్పర్వతాలు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్మాధవి పాల్గొన్నారు.