జీహెచ్ఎంసీ సమావేశంలో చెత్త పై పంచాయతీ

జీహెచ్ఎంసీ సమావేశంలో చెత్త పై పంచాయతీ

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చర్చలు జరుగుతున్నాయి. సభలోని మేయర్ పొడియం వద్దకు వచ్చి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు. గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీలో సానిటేషన్ సరిగ్గా లేదని బీఆర్ఎస్ కార్పోరేటర్లు విమర్శించారు. కాంగ్రెస్ కార్పోరేటర్లు స్పందిస్తూ గతంలో నగరమంతా చెత్త లేదా అని ప్రశ్నించారు. 

చెత్త సేకరణ రాంకి సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందని, చెత్త క్లీన్ చేయాలంటే ప్రైవేట్ సంస్థలను అడుక్కోవాలా అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రాంకీ సంస్థతో కేటీఆర్ కు ఒప్పంధాలు లేవా అని కాంగ్రెస్ కార్పోరేటర్లు ప్రశ్నించారు. ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్యనికి కారణం కేటీఆర్ కాదా అని హస్తం నేతలు విమర్శించారు.  దీంతో సభ మొత్తం రసభసగా మారింది.