నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంకు హైదరాబాద్ నుంచి ఈఎన్ సీ అధికారులు చేరుకున్నారు. వీరిలో హరి రామ్, సీఈలు హమీద్ ఖాన్, రమేష్ బాబు,ధర్మ నాయక్ అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 2023 డిసెంబర్ 1న డ్యాంపై13వ గేట్ దగ్గర ఏపీ, తెలంగాణ అధికారులు చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే KRMBకి తెలంగాణ అధికారులు లెటర్ రాశారు.
కృష్ణా రివర్ బోర్డుకు లెటర్ ఇవ్వకుండా ప్రాజెక్టు నుంచి.. నీళ్లు తీసుకుపోవడం తెలంగాణ అధికారులపై దాడికి దిగడం.. సరి అయింది కాదు అంటూ అధికారులు మండిపడుతున్నారు. ఏపీ పోలీసులతో పాటు ఇరిగేషన్ అధికారులపై తెలంగాణ ఎస్పీ ఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు నాగార్జున సాగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
నీటి విడుదల విషయంలో రాజకీయ కోణాన్ని తెలంగాణ నేతలు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. డ్యాంపై పోలీస్ అవసరం ఏంటి అని ప్రశ్న ... ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ధ్వంసం ఎలా చేస్తారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఇప్పటివరకు నీళ్లు ఇవ్వలేదని.. అర్ధరాత్రి నీళ్ళని ఎలా తీసుకెళ్తారంటూ.. తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరికాసేపట్లో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నాగార్జున సాగర్ డ్యాంకు వెళ్లి అక్కడ పరిశీలనలు జరపనున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర 6 వందల మంది తెలంగాణ పోలీస్ బలగాలు చేరుకున్నారు. 2023 డిసెంబర్ 1న మధ్యాహ్నం నాగార్జున సాగర్ ఇరిగేషన్ అధికారులతో కేఆర్ఎంబీ(krmb) బృందంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.