- అసెంబ్లీ ఎన్నికల కు ముందే క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డి
- ఇప్పటికే రేవంత్ రెడ్డితో డిస్కషన్
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల పైన రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. లోక్సభ కు పోటీ చేస్తానని అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ప్రకటించారు. అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పిన ఆయన.. పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటానని చెప్పడంతో ఇప్పుడు చర్చ మొదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ జానారెడ్డికి ఇంటికి సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జానారెడ్డి మనసులో మాట
బయటపెట్టారు.
కాంగ్రెస్కు కంచుకోటగా..
నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినప్పటికీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు పట్టుంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడా ఖాతా తెరవలేదు. గత రెండు ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ మూడు చోట్లనే గెలుపొందింది. అదే 2019 ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతూ వస్తున్నారు.
భువనగిరి ఎంపీ స్థానం పైన యువనేతలు ఫోకస్
భువనగిరి పార్లమెంట్ స్థానం పైన యువనేతలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పీసీసీ ఉపాధ్యక్షుడు శాలిగౌరారం మండలానికి చెందిన చామల కిరణ్కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రం పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన ఎంపీగా పోటీ చేయాలని సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తిలో మందుల సామేలు గెలుపు కోసంఆయన పని చేశారు.
ఎంపీగా పోటీ చేయాలనే తన అభిప్రాయాన్ని ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద వ్య క్తం చేశారు. భువనగిరి ఎంపీ పరిధిలో జనగామ మినహా, మునుగోడు, న కిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలుపొందింది. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచా రు. 2009లో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎంపీగా గెలుపొందారు. ఈ దఫా బీసీ కోటాలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఎంపీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద ర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన వెంకన్నది తుంగతుర్తి నియోజకవర్గం. దీం తో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
పటేల్ రమేశ్ రెడ్డికి మరో చాన్స్!
ఇదిలావుంటే సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ఆశించిన పటేల్ రమేశ్ రెడ్డిని బుజ్జిగించేందుకు ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు జానారెడ్డి పోటీ చేస్తానని చెప్పడం తో రమేశ్ రెడ్డికి ప్రభుత్వంలో మరో పదవి ఏదైనా ఇస్తారనే టాక్ నడుస్తోం ది.