కౌన్సిలర్లతో ముఖ్య నేతల చర్చలు
కామారెడ్డిపై ఇక నుంచి కేటీఆర్స్పెషల్ ఫోకస్
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో గులాబీ నేతల మధ్య గుప్పుమన్న విభేదాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్‌పెట్టారు. మంత్రి ఆదేశంతో స్థానిక లీడర్ల మధ్య ఉన్న విభేదాలను చక్కబెట్టడానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. నిధుల కేటాయించడం లేదని, హైదరాబాద్‌లో జరిగిన మీటింగ్‌కు సైతం తమను పిలవకుండా వివక్ష చూపారని బుధవారం కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. వారితో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి శేరి సుభాష్‌రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. మీటింగ్‌కు పిలవకపోవడమే కాకుండా, తమ వార్డులకు ఫండ్స్ కేటాయించడం లేదని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కొందరు కౌన్సిలర్లకే అధిక ప్రియారిటీ ఇస్తున్నారని వాపోయారు.
అందరు కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని, ఏమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము ప్రస్తుతమున్న టౌన్ లీడర్లతో పని చేయమని, తమ వార్డుల్లో మాత్రమే పనిచేస్తామని, అవసరమయితే ఎవరినైనా కొత్తవారిని తమకు ఇన్చార్జిగా పెట్టండని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. త్వరలోనే కేటీఆర్‌తో భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తానని కౌన్సిలర్లకుక సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చారు.
విస్తృత స్థాయి సమావేశంలోనూ..
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 7న నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం కూడా పార్టీ ముఖ్య లీడర్లతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మండలాలవారిగా పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల స్టేటస్‌ను కేటీఆర్ క్షుణ్నంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతల మధ్య అంతర్గత కలహాలు, విభేదాలు రివ్యూ మీటింగ్సందర్భంగా కేటీఆర్ దృష్టికి వెళ్లాయి.
కొందరు నేతల పనితీరుపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 7న కామారెడ్డిలో నిర్వహించిన మీటింగ్సందర్భంగా కూడా ఫ్లెక్సీల్లో ఫొటోల వివాదం కూడా ఇది వరకే మంత్రి దృష్టికి వెళ్లింది. ముఖ్య లీడర్లపై ఫిర్యాదులు రావడంతో కేటీఆర్ సీరియస్‌గా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు.