పాతరోడ్డు పునరుద్ధరణకు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంగీకారం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 11వ గనికి వెళ్లే పాత రోడ్డును పునరుద్ధరించాలని యూనియన్లు, కార్మికులు చేస్తున్న ఆందోళనకు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగివచ్చింది. శుక్రవారం యూనియన్ల లీడర్లకు, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చలు జరిగాయి. చర్చల్లో ఆర్జీ 1 ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజీఎం లక్ష్మీనారాయణ, యూనియన్ల లీడర్లు జనక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిర్యాల రాజిరెడ్డి, యాదగిరి సత్తయ్య, రియాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టి.రాజారెడ్డి, విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇ.నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

చర్చల అనంతరం పాత రోaడ్డు పునరుద్ధరణకు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంగీకరించింది. ఈ నెల 11లోగా ఫైవింక్లయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జీడీకే 11వ గని వరకు రోడ్డు మధ్యలో రిపేర్లు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళనను విరమించి డ్యూటీలకు అటెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కాగా జీడీకే 11వ గనికి వెళ్లేందుకు వేసిన కొత్త రోడ్డు  వల్ల దూరం పెరిగిందని పాత రోడ్డును పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్​ చేశారు. ఇందులో భాగంగా బుధవారం గనికి లాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించగా, శుక్రవారం ఉదయం  కూడా కార్మికులు గని వద్ద ధర్నా చేపట్టారు.