స్టెతస్కోప్‌‌, సి.టి. స్కాన్‌‌కి బదులు.. న్యూమో వెస్ట్‌ జాకెట్

స్టెతస్కోప్‌‌, సి.టి. స్కాన్‌‌కి బదులు.. న్యూమో వెస్ట్‌ జాకెట్

మారిన లైఫ్‌‌ స్టైల్‌‌ వల్ల మనుషులకు రకరకాల జబ్బులు వస్తున్నాయి. శరీరంలో ఏం జరుగుతోందో, లోపల ఎలాంటి జబ్బు ఉందో తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. అందుకే టెక్నాలజీ సాయంతో వాటిని సులువుగా గుర్తించడానికి రకరకాలవి కనిపెడుతున్నారు  సైంటిస్ట్‌‌లు. జర్మనీకి చెందిన ఫ్రాన్‌‌హోఫెర్‌‌‌‌ రీసెర్చ్‌‌ గ్రూప్‌‌, ఎం క్యూబ్‌‌ (m3) ఇన్ఫెక్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లో భాగంగా ఒక వెస్ట్​ (జాకెట్‌‌)ని తయారుచేశారు. దీనికి ‘న్యూమో వెస్ట్’ అని పేరుపెట్టారు. 

ఈ జాకెట్‌‌కి ముందు, వెనక పైజోసెరామిక్‌‌ అకౌస్టిక్‌‌ సెన్సర్‌‌ ఉంటుంది. ఆ సెన్సర్‌‌‌‌ ఊపిరితిత్తుల్లో జరిగే మార్పులను కనిపెట్టి మొబైల్‌‌కి సిగ్నల్స్ పంపిస్తుంది. దాంతో ఊపిరితిత్తుల్లో ఎలాంటి జబ్బు ఉందో కనిపెట్టొచ్చు. ‘కొవిడ్‌‌ వచ్చిన చాలామందిలో లంగ్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే న్యూమో వెస్ట్‌‌ని కొవిడ్‌‌ వచ్చిన వాళ్లపైనే టెస్ట్‌‌ చేశాం. శ్వాస నాళాల్లో  ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ సెన్సర్‌‌‌‌ చాలా ఉపయోగపడింది. స్టెతస్కోప్‌‌, సి.టి. స్కాన్‌‌కి బదులుగా భవిష్యత్తులో న్యూమో వెస్ట్‌‌ వాడొచ్చు’ అని చెప్తున్నాడు ప్రాజెక్ట్‌‌ మేనేజర్‌‌‌‌ రాల్ఫ్‌‌ షాలెర్ట్‌‌.