కల్తీపాలతో రోగాలు.. విజయ డెయిరీ పాలతో ఆరోగ్యం

కల్తీపాలతో రోగాలు.. విజయ డెయిరీ పాలతో ఆరోగ్యం
  • బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్, వెలుగు: కల్తీపాలతో క్యాన్సర్​ లాంటి  ఎన్నోరకాల రోగాలు వస్తున్నాయని  ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్​లోని ఇరిగేషన్ గెస్ట్​ హౌస్​లో కౌన్సిలర్లు, మున్సిపల్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ప్రస్తుతం ప్రజలు ప్యాకెట్ పాలు, నాసిరకం పాలు  వినియోగించడంతో  క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. విజయ డెయిరీలో  నాణ్యమైన పాల ఉత్పత్తవుతున్నాయని  పేర్కొన్నారు.  విజయ డెయిరీ పాల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఉర్దూఘర్​నూతన అధ్యక్షుడిగా లియాఖత్​ హుస్సేన్​ నియమకం

 బోధన్ పట్టణంలోని ఉర్దూఘర్ నూతన  అధ్యక్షుడుగా లియాఖత్ హుస్సేన్ ను నియమిస్తూ నియమకపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.  కమిటీ కార్యదర్శిగా ఖుర్షీద్ హుస్సేన్ ను,  కన్వీనర్ గా బోధన్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఉపాధ్యక్షుడిగా షేక్ వాజీద్, సభ్యులుగా అజీజ్ హుస్సేన్, నసీర్ ఆలీ, సిరాజుద్దీన్, సహారాబేగం ను నియమిస్తూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి బోధన్​లోని శ్రీచక్రేశ్వరశివాలయానికి చేరుకుని కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి హారతిని స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​ పర్సన్​ తూము పద్మశరత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ బి. గంగా శంకర్,  శివాలయం చైర్మన్​ హరికాంత్​ చారి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.