- పలువురికి గాయాలు
సికింద్రాబాద్, వెలుగు: ఓ ట్యాంకర్ నుంచి డీజిల్ లీకై రోడ్డుపై పడడంతో.. ఆ దారి గుండా వెళ్తున్న వాహనదారులు జారి కిందపడ్డారు. ఈసీఐఎల్ నుంచి నాగారం వెళ్లే దారిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఒకటి తర్వాత మరొకటి దాదాపు 20 వాహనాల వరకు రోడ్డుపై పడడంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ తలకు తీవ్ర గాయం కావడంతో సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కుషాయిగూడ పోలీసులు తెలిపారు.