
గజ్వేల్, వెలుగు: గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అసంతృప్త నాయకుడు గాడిపల్లి భాస్కర్అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ లీడర్ మాదాడి జశ్వంత్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. గజ్వేల్‌లో ఈటల రాకతో బీజేపీ గెలుపు ఖాయమైందని, సీఎం కేసీఆర్పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు.
తనతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్లు పార్టీకి రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరనున్నట్టు చెప్పారు. మాదాడి జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నానని, కలిసికట్టుగా కృషి చేసి ఈటల రాజేందర్‌ను గెలిపించి తీరతామన్నారు. గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మెన్ టేకులపల్లి రామ్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.