కడుపు మండింది : ఓలా బైక్ షోరూంను తగలబెట్టిన కస్టమర్

కడుపు మండింది : ఓలా బైక్ షోరూంను తగలబెట్టిన కస్టమర్

ఓలా బైక్ కొన్నాడు కస్టమర్.. పదేపదే రిపేర్లు వస్తుంది.. ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా పరిష్కారం కాలేదు.. సమస్య తీరటం లేదు.. దీనిపై ఓలా బైక్ షోరూం వాళ్ల నుంచి సరైన సమాధానం లేదు.. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్.. ఏకంగా ఓలా బైక్ షోరూంను తగలబెట్టాడు.. ఇది మన బెంగళూరు సిటీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రం కలబురిగి ఏరియా.. నదీమ్ అనే 26 ఏళ్ల యువకుడు. 2024, ఆగస్ట్ 28వ తేదీన ఓలా బైక్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రిపేర్ వచ్చింది. బండి స్టార్ట్ కావటం లేదు. దీంతో రిపేర్ కోసం కలబురిగిలోని ఓలా షోరూంలో ఇచ్చాడు. రిపేర్ చేసిన బైక్ తీసుకెళ్లాడు.. మళ్లీ బండి స్టార్ట్ కాలేదు.. మళ్లీ షోరూంలో ఇచ్చాడు. ఆ తర్వాత బండి రిపేర్ కాలేదు. దీనిపై షోరూం యజమాని, వర్కర్లతో వాగ్వాదానికి దిగాడు. పదేపదే బండి ప్రాబ్లం వస్తుండటంతో.. శాశ్వత పరిష్కారం చూపించకపోవటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశాడు నదీమ్.

Also Read :- తోడేళ్లు మళ్లీ దాడి చేశాయి.. బాలికకు తీవ్రగాయాలు

కొత్త బైక్ కొనుగోలు చేసి 20 రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా బక్ సరిగా నడవలేదని.. సమస్య పరిష్కారంపై సరైన సమాధానం లేకపోవటంతో కోపంతో ఊగిపోయాడు నదీం. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం షోరూంకు వచ్చిన కస్టమర్ నదీం.. తన బండి రిపేర్ విషయంపై సిబ్బందితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి.. పెట్రోల్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన పెట్రోల్ ను షోరూంలో పోసి నిప్పంటించాడు. 

అసలే అన్నీ ఎలక్ట్రిక్ బైక్స్.. దీనికితోడు పెట్రోల్ మంటలు.. దీంతో షోరూంలోని  బైక్స్ కాలి బూదిదయ్యాయి. 11 లక్షల వరకు నష్టం అని షోరూం వెల్లడించింది. ఈ అంశంపై ఓలా కంపెనీలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. నిందితుడు నదీంను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.