గర్భవతిగా ఉన్నా.. నా భర్త ఎన్ కౌంటర్ ను తట్టుకోలేను: చెన్నకేశవులు భార్య

గర్భవతిగా ఉన్నా.. నా భర్త ఎన్ కౌంటర్ ను తట్టుకోలేను: చెన్నకేశవులు భార్య

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ ప్రజలు హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దిశ హత్యకేసు నిందితుల కుటుంభసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ కౌంటర్ పై నిందితుల కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నలుగురు కలిసి ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పిడితే ఏ3 ముద్దాయి చెన్నకేశవులకు వ్యతిరేకంగా మాట్లాడామని అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కోర్ట్ లో కేసు విచారణ కొనసాగుతుండగానే తన భర్తను ఎన్ కౌంటర్ చేయడం దారుణమన్నారు. రేప్ చేసిన వాళ్లని జైల్లో ఉంచి కుక్కలు లెక్కమేపుతున్నారని అన్నారు. కొన్నిరోజుల తరువాత తన భర్త వస్తాడని, పోలీసుల ఆధీనంలో ఉన్న భర్త చెన్నకేశవుల్ని చూసేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు వారించరని అన్నారు.

తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, పెళ్లై సంవత్సరం కూడా దాటలేదని చెన్నకేశవులు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నవయసులో పెళ్లి చేసుకొని, భర్తను కోల్పోవడంతో నరకం అనుభవిస్తున్నట్లు తెలిపింది. భర్తని ఏవిధంగా చంపారో తనని  కూడా అలాగే చంపేయండి అని చెన్నకేశవులు భార్య ప్రభుత్వాన్ని కోరుతుంది.