
ములుగు, వెలుగు : విద్యాభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున మొత్తం 54 ప్రైమరీ స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు ఫౌండేషన్ జనరల్ మేనేజర్ సి.మురళీధర్ తెలిపారు. అందులో భాగంగా గురువారం దత్తత తీసుకున్న పాఠశాలల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు మురళీధర్తోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.వేణుబాబు, పర్సనల్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, ఈసీఐఎల్ టీం సభ్యులు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. దిశా ఫౌండేషన్ ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాల్ రావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.