- దిశ మీటింగ్ లో ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : పబ్లిక్ అండ్ హెల్త్ నుంచి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి మధ్యలో ఉన్న వర్క్స్ ను ఎందుకు ఆపుతున్నారని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ నామా నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారాయని పనులు నిలుపుదల చేస్తున్నట్లు తెలిసిందని, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. ఖమ్మం సిటీలోని డీపీఆర్సీ బిల్డింగ్ లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) కేంద్ర పథకాలపై ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాచందన అధ్యక్షతన జరిగింది.
గంట ఆలస్యంగా మీటింగ్ ప్రారంభమైంది. దిశ మీటింగ్ కు కలెక్టర్ తప్పనిసరిగా ఉండాలి.. కానీ అటెండ్ కాలేదు. ఇది కూడా రికార్డ్ చేయాలని నామా కోరారు. అనంతరం ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల నిధుల గూర్చి కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్ పర్యవేక్షణలో రోడ్ల నిర్మాణం పెండింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యాపేట టు దేవరపల్లి రహదారిలో నిర్మాణం లో భాగంగా దంసలాపురం వద్ద ప్రజలకు రవాణాకు ఇబ్బంది తలెత్తకుండా ఎగ్జిట్ ఇవ్వాలని నేషనల్ అధికారులకు ఎంపీ సూచన చేశారు.
మున్సిపాలిటీల్లో ఎస్డీఎఫ్ వర్క్స్ ను పూర్తి కాకుండానే మధ్యలో ఎందుకు నిలిపివేశారని అధికారులను ఎంపీ అడిగారు. పనులన్నీ అండర్ ప్రోసెస్ లో ఉన్నాయని అధికారులు చెప్పారు. పెండింగ్ సమస్యల పురోగతిపై వన్ వీక్ లో రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లను ఎంపీ ఆదేశించారు. విద్యుత్ శాఖ గత సమస్యల పురోగతిని ఎస్ఈ సురేందర్ వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో నగర మేయర్ నీరజ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీవో విద్యాచందన, దిశ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.