మొన్న దీపికా పదుకొనే.. నిన్న కరీనా, ఆలియా.. ఈరోజు దిశా పటానీ. అందరి నోట ఒక్కటే మాట అదే డీ ఈ మేకప్. గ్లోయింగ్ అండ్ షైనింగ్ స్కిన్ కోసం చాలామంది సెలబ్రిటీలు ఈ మేకప్ లుక్‌నే ఫాలో అవుతున్నారిప్పుడు. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ డీ ఈ మేకప్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. రెగ్యులర్‌గా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ట్యుటోరియల్స్ చెప్తుంటోంది దిశా. అలా ఈ మధ్య డీ ఈ మేకప్ గురించి మాట్లాడింది. డీ ఈ మేకప్ లుక్‌ని పోస్ట్ చేసి ఎంతమందికి ఈ మేకప్ ట్యుటోరియల్ కావాలనిపిస్తోంది అంటూ ఇన్‌స్టాలో పోల్ కండక్ట్ చేసింది. దాంతో అందరి దృష్టి దిశా మేకప్‌పై పడింది. షైనింగ్ స్కిన్‌తో మెరిసిపోతున్న దిశాని చూసి ఈ మేకప్ గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు అంతా. ఇంత క్రేజ్ ఉన్న ఈ మేకప్ ఎలా వేసుకోవాలంటే..
ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి. టోనర్ సీరమ్‌లో దూది ముంచి ముఖం, మెడ, ఛాతి భాగాల్ని తుడవాలి. డీ ఈ మేకప్ లుక్‌కి సీరమ్ టోనర్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ లుక్ ట్రై చేసేవాళ్లు మామూలు టోనర్స్ జోలికి వెళ్లొద్దు. రెండు చుక్కలు కూలింగ్ ఐ–జెల్‌ని కళ్ల కింద రాయాలి. తర్వాత డ్రై స్కిన్ వాళ్లు ఎస్పిఎఫ్ ఉన్న మాయిశ్చరైజర్‌ని, ఆయిలీ స్కిన్ వాళ్లు మ్యాటీ ప్రైమర్‌ని ముఖానికి రాయాలి. తర్వాత ఫేస్ మిస్ట్‌ని ముఖంపై జల్లి కాసేపు ఆరనివ్వాలి. డీ ఈ మేకప్ లుక్‌కి సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ వాడొద్దు.
తర్వాత లైట్ కలర్ ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్‌ని ముఖానికి రాసి చేతివేళ్లతో నెమ్మదిగా తట్టాలి. షైనింగ్ లుక్ కోసం మామూలు పౌడర్స్కి బదులు క్రీమీ బ్రష్‌లని ఎంచుకోవాలి. లిక్విడ్ హైలైటర్స్ని గడ్డం, చీక్, ఐ– బోన్స్, పై పెదవి పై భాగంలో అప్లై చేయాలి. ఐ– ఇన్నర్ కార్నర్స్, ఐ బ్రో బోన్స్పైనా లిక్విడ్ హైలైటర్స్ని రాయాలి. మేకప్ పూర్తయ్యాక బ్రోజర్స్ని కనురెప్పల మీద బ్రష్‌తో అప్లై చేయాలి. బ్రౌన్ మస్కారా మాత్రమే ఎంచుకోవాలి.