Disha patani: దిశా పటాని చేతిపై PD టాటూ.. P అంటే ప్రభాసేనా!

ఓపక్క కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతుంటే.. మరోపక్క ఓ టాటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన చేతిపై వేసుకున్న టాటూ ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఆ టాటూను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు లింక్ చేస్తున్నారు కాబట్టి. అదేంటీ.. దిశా పటాని చేతిపై టాటూ వేసుకుంటే.. దానికి ప్రభాస్ కి లింక్ ఏంటనే సందేహం రాక మానదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నార్త్ బ్యూటీ దిశా పటాని ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ రాక్సీ అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. అయితే ఇటీవల ఆమె తన చేతిపై PD అనే ఇంగ్లీష్ లెటర్స్ ను టాటూగా వేయించుకోంది. అందులో.. P అనే లెటర్ ను ప్రభాస్ ను ఉద్దేశించే ఆమె వేయించుకున్నారని, PDలో P అంటే ప్రభాస్, D అంటే దిశా పటాని అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక మరికొందరేమో.. PD అనే టాటూకి ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదని, దిశా పటాని(Disha Patani) అనే ఆమె పేరునే రివర్స్ గా అలా టాటూ వేయించుకున్నారు అని చెప్తున్నారు. ఇక కల్కి సినిమాలో కూడా ప్రభాస్, దిశా మధ్య ఎక్కువ సీన్స్ కూడా లేవని, కనీసం స్నేహం ఏర్పడే ఛాన్స్ కూడా లేదని, అలాంటిది టాటూ వేయించుకునే వరకు రాగలరని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దిశా పటాని వేసుకున్న టాటూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.