![తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగుల తొలగింపు.. ఈవో శ్యామల రావు ఉత్తర్వులు](https://static.v6velugu.com/uploads/2025/02/dismissal-of-18-other-caste-employees-in-tirumala-orders-of-evo-shyamala-rao_L7SjwpYkvQ.jpg)
హైదరాబాద్, వెలుగు: టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ బుధవారం ఈవో శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం.. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం.. హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది.. నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ.. భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ.. టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.