టైంకు డ్యూటీకి రాలేదని సిబ్బంది తొలగింపు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

మణుగూరు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమయానికి ఎలక్షన్ డ్యూటీకి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతీక్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డీసీ శర్మ, ఓపీఓలు కవిత, శ్యామల సత్తిబాబు, ఎస్ఎంజే రాణి నిర్ధేశించిన సమయానికి డ్యూటీకి రాలేవదని, ఆఫీసర్లు పంపిన సమాచారానికి స్పందించలేదని సస్పెండ్ చేశామన్నారు.