Disney+ కూడా నెటిఫ్లిక్స్ బాటలో నడుస్తోంది. ఖాతాల పాస్ వర్డ్ షేరింగ్ నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. నమోదు చేయబడిన ఫ్యామిలీ మెంబర్ల డివైజ్లకు తప్ప ఏ ఇతర డివైజ్ లకు డిస్నీ ఖాతాలను షేర్ చేయకుండా నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ఈ మెయిల్స్ ద్వారా కస్టమర్లకు తెలిపింది. ఖాతా షేరింగ్ నిరోధించే విషయాన్ని ఆగస్టులోనే Disney+ సీఈవో బాబ్ ఐగర్ సంకేతాలిచ్చారు.
కొత్త సబ్ స్క్రైబర్ అగ్రిమెంట్ ప్రకారం.. కుటుంబ సభ్యుల డివైజ్ లకు మాత్రమే ఖాతా షేరింగ్ వర్తిస్తుంది. ఏ ఇతర వ్యక్తిగత ఖాతాలకు షేరింగ్అనుమంతిచబడదు. అంతేకాదు కుటుంబ సభ్యులే కాకుండి నైబర్స్ ను కూడా ఖాతాలో చేర్చుకునేలా డిస్నీ.. కొత్త ఛార్జీల ఎంపికలను కూడా పరిచయం చేస్తోంది. సభ్యుల సంఖ్య ను బట్టి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా డిస్కౌంట్ కూడా ఇస్తోంది.
ALSO READ : విశాఖ ఇండస్ట్రీస్కు ఆరు వారాల్లోపు డబ్బులు చెల్లించండి.. హెచ్సీఏకు హైకోర్టు ఆదేశం
అమెరికాతోపాటు ఇతర దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్ ను అరికట్టేందుకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫారమ్ నెట్ ఫ్లిక్స్ గతంలోనే చర్యలు చేపట్టింది. నెలకు 8 డాలర్ల చొప్పున ప్రతి వ్యక్తిపై అదనపు ఛార్జీల వసూలు చేస్తోంది.
ఇటీవల అమెజాన్ కూడా తన ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ మార్పులను సంబంధించిన ప్రకటన చేసింది. అడ్వర్టైజ్ మెంట్ పరిమితులను పరిచయం చేసింది.