ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమఠం,'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్((Save TheTigers Season 1). ఈ సీరిస్ ఆడియన్స్కు భలే కిక్కిచ్చింది. చూస్తున్నంత సేపు ప్రతి సీన్లో నవ్వుకునేలా తెరకెక్కించారు మేకర్స్. ఓటీటీలో ఫస్ట్ సీజన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం సెకండ్ సీజన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్, సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సమయం ఆసన్నమైంది. అతి త్వరలో సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (Save TheTigers Season 2) రాబోతుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney Plus Hotstar) ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ఇచ్చింది.
ప్రియదర్శి, చైతన్యకృష్ణతో పాటు అభినవ్ గోమటం జైలులో ఉన్నట్లుగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే మార్చి ఫస్ట్ వీక్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.ఈ వెబ్‌సిరీస్‌కు యాత్ర డైరెక్టర్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించగా..తేజా కాకుమాను డైరెక్ట్ చేశాడు.
సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్టోరీ విషయానికి వస్తే..
ఫస్ట్ సీజన్లో ఓ హీరోయిన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గరు అరెస్ట్ కావడంతో ఎండ్ కార్డు పడేలా చూపించారు. ఇక ఆ అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? వారు ముగ్గురు జైలు నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అనే కథతో ఇంట్రెస్టింగ్ హ్యూమర్ టచ్ను జోడిస్తూ సెకండ్ సీజన్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Can anyone save the tigers this time around?! #HotstarSpecials #SavetheTigers S2 coming soon. pic.twitter.com/Yb1rtpoZao
— Disney+ Hotstar (@DisneyPlusHS) February 14, 2024
సేవ్ ద టైగర్స్ సీజన్ 1 విషయానికి వస్తే..
భార్య బాధితులైన ముగ్గురి యువకుల కథే ఇది. భార్యా,భర్తల మధ్య సహజంగా వచ్చే చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలు, అభిప్రాయ బేధాలు ఇవే ఈ సిరిస్ ఈ నేపథ్యం. ఇలాంటి పాయింట్ తో తెలుగులో ఇప్పటికి చాలా సినిమాలే వచ్చాయి. కానీ..వాటికీ ఈ సిరీస్ కి తేడా ఏంటంటే? ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.
ప్రసెంట్ జనరేషన్ జంటల మధ్య రెగ్యులర్గా ఉండే పరిస్థితులకి కాసింత వినోదాన్ని జోడించి చాలా చూపించారు. అందుకే.. సినిమా చూసే ఎవరైనా ఈజీ గా కనెక్ట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఈ కథతో రిలేట్ చేసుకుంటారు.సిరీస్ ఎంత సహజంగా ఉంటుందో.. కథలో సందేశాన్ని కూడా అంతే చక్కగా చూపించారు. కావలసినంత కామెడీ, కోరుకున్నంత సెటైర్, పదే పదే గుర్తొచ్చేంత ఫన్, ఊహలకు అందనంత డ్రామా.. అన్నీ కలిసిన ఒక సరికొత్త సిరీస్ సేవ్ ద టైగర్స్.