
బాణం చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది క్యూట్ బ్యూటీ వేదిక (Vedhika). నారా రోహిత్ సరసన ఎంతో ట్రెడిషనల్గా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలకృష్ణ, ఆది సాయికుమార్ లాంటి హీరోల సరసన అవకాశాలొచ్చాయి. కానీ ఆశించిన స్థాయికి ఎదగలేదు.30 ప్లస్ ఏజ్లో ఉన్న వేదిక ఇప్పటికీ తన రూపాన్ని అందంగా మెయింటెయిన్ చేయడం కోసం చాలా శ్రమిస్తోంది.
తాజాగా హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి(Yakshini).ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో విభిన్న శైలి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సరికొత్త థ్రిల్లింగ్ సిరీస్ ను ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిస్తున్నారు డైరెక్టర్ తేజ. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ పంచుతున్న ఈ సిరీస్..ఎలా ఉండబోతోందనే రేపింది.
ఈ సిరీస్ పై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.."మగవారందరూ, జాగ్రత్త! మీ కోసం యక్షిణి వస్తోంది! ఆమె చివరి వేట త్వరలో ప్రారంభమవుతుంది!" అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
వేదిక విషయానికి వస్తే..
తెలుగు తమిళంలో ప్రధానంగా నటించిన వేదిక పూర్తి పేరు వేదిక కుమార్. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019లో బాలకృష్ణ రూలర్‌తో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. అదే సంవత్సరంలో స్పానిష్ చిత్రం హిందీ రీమేక్ అయిన 'ది బాడీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా వేదిక తెలుగులో రజాకార్ మూవీలో నటించి మెప్పించింది.
Men, beware! Yakshini is coming for you! The hunt for her last prey begins soon! #YakshiniVasthundi Coming Soon in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, bangla, Marathi only on #DisneyPlusHotstar@vedhika4u @ActorRahulVijay @LakshmiManchu @UrsAjayRavuri @arkamediaworks… pic.twitter.com/j4lkHfTFvd
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 21, 2024