ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్​63 బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూములియ్యం : రైతులు

మెట్ పల్లి, వెలుగు: ఎన్​హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమ భూములిచ్చేది లేదని నిర్వాసిత రైతులు తేల్చిచెప్పారు. సోమవారం భూ సర్వే ను వ్యతిరేకిస్తూ మెట్ పల్లి, బండలింగపూర్, వెల్లుల్ల, చౌలమద్ది రైతులు మేడిపల్లి లో నిరాహార దీక్షలు చేపట్టారు. 

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన రైతుల  భూములను బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తీసుకుంటే వందలాది మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్తాయన్నారు. సర్వే నిలిపివేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.