- ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వివాదం
- నాగార్జున సాగర్ డ్యాంపై హైటెన్షన్
హైదరాబాద్:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం చల్లారలేదు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదుకు తెలంగాణ అధికారు లు వెళ్లారు. అయితే రైట్ కెనాల్ వద్ద మీకేం పనంటూ వీరిని ఏపీ ఆఫీసర్లు అడ్డుకున్నారు. దీంతో సాగర్డ్యాంపై హై టెన్షన్ నెలకొంది. ఈ ఘటనపై కేఆర్‌ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారమిచ్చారు.
ALSO READ : మూసీ సమస్యలపై పాదయాత్రకు రెడీ : మాజీ మంత్రి హరీశ్ రావు
ఇరు రాష్ట్రాల అధికారులకు సాగర్ ఎస్‌ఈ కృష్ణమోహన్ సర్దిచెప్పారు. కాగా, గతేడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల మధ్య జల ఘర్షణ లు జరిగాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి.