సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడి

సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడి

యాసిడ్ దాడి.. ఈ పదం వినగానే మనకు గుర్తచ్చేది.. ప్రియురాలిపై ప్రియుడి యాసిడ్ దాడి.. లేక ఓ మహిళపై దుండగుల యాసిడ్ దాడి. కానీ దీనికి భిన్నంగా ఓ యువకుడు మరో యువకుడిపై యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నారాయణఖేడ్ లో ఓ యువకుడిపై మరో యువకుడు యాసిడ్ పోశాడు. విజయ డైరీలో పనిచేస్తున్న అజయ్, దత్తు స్నేహితులు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. యువకులిద్ధరూ ఒకరిపై ఒకరు మాటలు రువ్వకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడవ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన  అజయ్ ..దత్తుపై యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.