విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం.. శంషాబాద్ చేరుకునేలోపు చెమటలు పట్టించాడు..!

విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం.. శంషాబాద్ చేరుకునేలోపు చెమటలు పట్టించాడు..!

శంషాబాద్: సౌదీ అరేబియా (దమామ్) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. విమానం గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసి ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించాడు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని పైలట్ ల్యాండింగ్ చేయగానే ప్రయాణికుడిని ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. తాజా ఘటనతో శంషాబాద్ విమానాశ్రయం మార్చి నెలలో రెండోసారి వార్తల్లో నిలిచింది.

ALSO READ | సూర్యాపేట హైవేపై ఘోరం.. హైవేపై మొక్కలకు నీళ్లు కొడుతున్న.. నీళ్ల ట్యాంకర్ను ఢీ కొట్టిన ఇన్నోవా

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఏషియా విమానం మార్చి 17న అత్యవసరంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. టెక్నికల్ ఇష్యూతోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి హైదబాబాద్కు విమానం వస్తుండగా ఈ ఘటన జరిగింది.

విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే శంషాబాద్ ఏటీసీకీ సమాచారమందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 737 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ పోర్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.