పని చేయని రెండో యూనిట్.. సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అంతరాయం

పని చేయని రెండో యూనిట్.. సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అంతరాయం

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జెన్ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ ప్లాంట్‎లోని ఎనిమిది యూనిట్లలో ఏడింటిలోనే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సాంకేతిక కారణాల వల్ల రెండో యూనిట్ పని చేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్‎లో సాంకేతిక లోపం తలెత్తగా.. అధికారులు నేటీకి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుద్ ఉత్పత్తి నిలిచిపోయింది. నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం ఎనిమిది యూనిట్లు ఉండగా.. ఒక్కో యూనిట్‎లో ప్రతి రోజు 100 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. 

ALSO READ | సింగరేణి కీలక నిర్ణయం: అటవీ భూముల్లో బొగ్గును తవ్వుతాం.. జీఎం జాన్

దీంతో గత 75 రోజులుగా సాగర్‎లో  విద్యుత్ ఉత్పత్తి  చేస్తు్న్నారు. ఇందులో ఒక యూనిట్ వర్క్ చేయకపోవడంతో 75 రోజులకుగానూ 75,00 మెగావాట్ల విద్యుత్ నష్టం వాటిల్లింది. అయినప్పటికీ మరమ్మతులు చేయించకుండా అధికారులు తమకేమి పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో కూడా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారులు మాత్రం జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.