ఇల్లందు ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు.. హరిప్రియకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల భేటీ

ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నాయకులే ఆమె తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పులిగల మాధవరావు, ఇల్లందు ఎంపీపీ భర్త జానీపాషా, బయ్యారం ప్యాక్స్ (పీఎస్ఎస్) మూల మధుకర్ రెడ్డి, ఇల్లందు ప్యాక్స్ చైర్మన్ మెట్ల కృష్ణ, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు తండ్రి శ్రీకాంత్, గార్ల మండలం మాజీ ఎంపీపీ వెంకట్ లాల్ తోపాటు మరో 20 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దని బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.