కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. గురువారం (అక్టోబర్ 24) జరిగిన పార్లమెంట్ సమావేశంలో కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో .. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా రాజీనామా చేయాలని లిబరల్ అసమ్మతి ఎంపీలు పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ క్లోజ్డ్ డోర్ సమావేశంలో లిబరల్ పార్టీ అసమ్మతి ఎంపీలు తమ అసంతృపత్తిని నేరుగా ట్రూడోకు తెలిపారు. అక్టోబర్ 29లోగా రాజీనామా చేయాలని అసమ్మతి ఎంపాలు ట్రూడోకు అల్టీమేటం ఇచ్చారు. దీంతో సొంత పార్టీనుంచే వ్యతిరేక రావడంతో ట్రూడో గందరగోళంలో పడ్డారు. మొత్తం 24 మంది అసమ్మతి ఎంపీలు లిబరల్ నేతగా ట్రూడోను వైదొలగాలని డిమాండ్ చేస్తూ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.అయితే చాలా మంది ఎంపీలు ప్రధాని ట్రూడోకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం.
కెనడాలో తాజా రాజకీయ చీలిక నిజానికి భారత్, కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఆజ్యం పొస్తుందని చెప్పొచ్చు. 2020లో భారత్ టెర్రరిస్టుగా గుర్తించిన నిజ్జర్ కాల్చి చంపబడిన తర్వాత భారత్, కెనడా మధ్య సత్సంబంధాలు తగ్గాయి. దౌత్యపరమైన వివాదం చెలరేగింది.
Also Read : చెన్నై కార్పొరేషన్లో చెత్త డంపింగ్ యార్డులలో AI కెమెరాల నిఘా
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. కెనడా పార్లమెంట్ ట్రూడో ఆరోపణలో భారత్ కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్ ట్రూడో వ్యాఖ్యలను ఖండించింది..ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దం, ప్రేరేపితం అని స్పష్టం చేసింది. కెనడా తమ దేశంలో తీవ్రవాద, భారత్ వ్యతిరేక కార్యకాలాపాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది.