- మీద పడి ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు
లింగంపేట, వెలుగు : వ్యవసాయ పంటలకు పురుగు మందు పిచికారీ చేయడం కోసం తీసుకువచ్చిన డ్రోన్ స్ప్రేయర్ ప్రారంభ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట లోని రైతువేదిక వద్ద డ్రోన్స్ప్రేయర్మీద పడడంతో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. లింగంపేట మండల సమాఖ్య సభ్యులకు వారం కింద డీఆర్డీఏ ఆఫీసర్లు డ్రోన్ స్ప్రేయర్అందజేశారు. దీన్ని ప్రారంభించేందుకు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్...ఎంపీపీ, ఎంపీటీసీ ఇతర లీడర్లను రైతువేదిక వద్దకు ఆహ్వానించారు. ఈ క్రమంలో డిస్ట్రిక్ట్రైనర్రంజిత్డ్రోన్స్ప్రేయర్ఆన్చేయగా ఎంపీపీ గరీబున్నిసా డ్రోన్‌ను రిమోట్‌తో ఆపరేట్ చేసే టైంలో ప్రమాదం చోటుచేసుకుంది. పైకి లేచిన డ్రోన్ ఎడమ వైపునకు దూసుకువెళ్లి లింగంపేటకు చెందిన తోట పరంధాములు, ముస్తాపూర్‌కు చెందిన నస్కంటి కాంతంలపై పడింది. బ్లేడ్స్ తాకడంతో పరంధాములు అరచేతికి, తొడ భాగంలో తీవ్ర గాయాలు కాగా కాంతం తొడలకు, చేతికి గాయాలయ్యాయి. ఇద్దరిని ప్రైవేట్దవాఖానాకు తరలించారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్గాయపడ్డవారిని పరామర్శించారు. ఐకేపీ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు.