ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యావిధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. బీఏ, బీకామ్‌‌, బీబీఏ, ఎంబీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ , డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 31 అక్టోబర్ 2020 వరకు అప్లై చేసుకోవచ్చు; కోర్సులు: 1. ఎంబీఏ (రెం డేళ్లు), ఎంబీఏ (మూడేళ్లు), అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టీఎస్ ఐసెట్ లేదా ఏపీఐసెట్‌‌లో అర్హత సాధించి ఉండాలి.

లేదంటే పీజీఆర్ఆర్‌‌సీడీఈ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2. ఎంఏ, ఎంకామ్‌‌, ఎంఎస్సీ, ఎంఏ- ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌‌మెంట్‌‌, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 3. బీఏ, బీకామ్ లలో ప్రవేశానికి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కు ఇంటర్ లో మ్యాథ్స్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి; దర ఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో..; చివరి తేదీ: 31 అక్టోబర్ 2020; వెబ్‌‌సైట్‌‌: oucde.net