భూదాన్ ​భూములను నిరు పేదలకు పంచాలి .. అఖిల భారత సర్వోదయ మండలి విజ్ఞప్తి

భూదాన్ ​భూములను నిరు పేదలకు పంచాలి .. అఖిల భారత సర్వోదయ మండలి విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: భూదాన్​ భూములను నిరుపేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం  మీడియా సమావేశంలో భూదాన్​ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కొడుకు వెదిరె ప్రోమోతిష్ చంద్రారెడ్డి, అఖిల భారత సర్వసేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు తోలుపునురి కృష్ణగౌడ్ పాల్గొన్నారు. 

అరవింద్​రెడ్డి మాట్లాడుతూ..  1951లో పోచంపల్లిలో భూదాన్​ ఉద్యమం మొదలైందని తెలిపారు.  75 ఏండ్లు పూర్తయినందున ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో వజ్రోత్సవాలు మొదలవుతాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయని చెప్పారు. జులై17న హైదరాబాద్​లో లక్షమందితో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. తక్షణమే తెలంగాణ భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.