మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలి : గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి

  • మంత్రి జగదీశ్​ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : మట్టి గణపతి ని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో  రాబోయే వినాయక చవితి వేడుకలను ప్రతీ ఒక్కరూ జరుపుకోవాలని   మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్​లో మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ ఆధ్వర్యంలో  అవగాహన పోస్టర్​ ఆవిష్కరించారు.  

ముఖ్య అతిథిగా  కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్  వచ్చారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడటమే పండగల  లక్ష్యం అని,   ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావ్, డిఎస్పీ నాగభూషణం , చివ్వెంల జడ్పీటిసి సంజీవ నాయక్, మారీపెద్ధి శ్రీనివాస్ గౌడ్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట కలెక్టరేట్​ అవరణ లో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు   కలెక్టర్ వెంకట్రావు, సీపీబీ ఈఈ  సురేశ్​ బాబు  తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యం లో 2 వేల విగ్రహాలు చిన్నవి, 125 పెద్ద విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.