
నిర్మల్, వెలుగు : ప్రతి ఏటా అందిస్తున్నట్లుగానే క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఈనెల 16, 17వ తేదీల్లో ఉచితంగా గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. 8 ఏండ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణానికి హాని చేయని రీతిలో గోమయం, పసుపు, మట్టి, చింత గింజలు, వేపాకు మిశ్రమం, ఎండు గడ్డి ఉపయోగించి గణేశ్ విగ్రహాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
స్థానిక శాస్త్రి నగర్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ గణపతులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, వివిధ గణేశ్ మండలి సభ్యులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేశీయ గో సంపదను కాపాడుకోవాలన్నారు. గోమయ గణపతులను గురువారం మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు అందజేసినట్లు దివ్యారెడ్డి తెలిపారు.