మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

సత్తుపల్లి, వెలుగు : హోప్ మినిస్ట్రీస్  సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు 100 కుట్టు మిషన్ లను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ బుధవారం అందజేశారు.  సత్తుపల్లిలోని జేవీఆర్​ డిగ్రీ కళాశాల ఆవరణలో పెనుబల్లి, వేంసూర్, సత్తుపల్లి మండలాలకు చెందిన మహిళలకు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  హోప్ మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. 

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ  కార్యక్రమములో హోప్ మినిస్ట్రీస్ సంస్థ డైరెక్టర్ శామ్యూల్ జాషువా గెడ్డం, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, కమల్ పాషా, పింగిలి సామేలు, పలువురు పాస్టర్స్ పాల్గొన్నారు.