హైదరాబాద్లో ఇవాళ ( అక్టోబర్ 05) .. 17 వేల 676 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ

2023 అక్టోబర్ 05 న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 వేల 676 నాలుగో విడుత డబల్ బెడ్ రూమ్ ఇళ్లను  లబ్థిదారులకు ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు.  ఇప్పటికే మొదటి విడతలో 11,700, రెండో విడత లో 13, 200,మూడో విడత లో 19,020 ఇళ్ళను పంపిణీ చేశారు. ఇక మిగిలిన  17, 676  ఇళ్లను ఇవాళ 7 ప్రాంతాల్లో  లబ్ధిదారులకు అందజేయనున్నారు. 

Also Read :- కార్మిక, బడుగుల అభ్యున్నతికి కాకా కృషి మరువలేనిది

కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ లో మంత్రి మహమూద్ అలీ, కొల్లూరులో హరీష్ రావు, మేడ్చల్ లో మల్లారెడ్డి, రాంపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్, కరెములలో తలసాని, తుంకుంటలో డిప్యూటీ మేయర్ శ్రీలత నాలుగో విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్లను  పంపిణీ చేయనున్నారు.  అయితే గడిచిన మూడు విడతల్లో మైనారిటీలకు రిజర్వేషన్ అంశం పరిగణలోకి తీసుకోకుండానే  డబల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి నాలుగో విడుత ఇళ్లలో అయిన  ప్రభుత్వ జీవో 10,12 రూల్స్ కు లోబడి పంపిణీ జరుగుతుందో లేదో చూడాలి.