చండ్రుగొండ లో 1.89 లక్షల చేప పిల్లలు పంపిణీ

చండ్రుగొండ, వెలుగు: చండ్రుగొండ మండలంలోని15 చెరువుల్లో1.89 లక్షల చేప పిల్లలు వదిలినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి వీరన్న తెలిపారు. మంగళవారం ఆయన చండ్రుగొండలో చేప పిల్లలు పంపిణీ చేసి మాట్లాడారు. చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రసూల్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.