ఆల్బెండజోల్‌‌ ట్యాబ్లెట్లు పంపిణీ

కాశీబుగ్గ, వెలుగు : నులి పురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వరంగల్‌‌ కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. ఖిలా వరంగల్‌‌లోని ఆరెల్లి బుచ్చయ్య సర్కార్‌‌ స్కూల్‌‌లో గురువారం ఆల్బెండజోల్‌‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సంవత్సరం నుంచి 19 ఏళ్లలోపు ఉన్న వారంతా తప్పనిసరిగా ట్యాబ్లెట్లు వేసుకోవాలని సూచించారు. హెల్త్‌‌తో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌‌తో పనిచేసి జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌‌వాడీ సెంటర్లలో పిల్లలకు ట్యాబ్లెట్లు వేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో వెంకటరమణ, డీఈవో వసంత పాల్గొన్నారు. అలాగే కాశీబుగ్గలోని శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్‌‌లో మెడికల్‌‌ ఆఫీసర్ మౌనిక ఆధ్వర్యంలో ఆల్బెండజోల్‌‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. 

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

జనగామ అర్బన్, వెలుగు : నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జనగామ కలెక్టర్‌‌ సీహెచ్‌‌. శివలింగయ్య సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జడ్పీ హైస్కూల్‌‌ స్టూడెంట్లకు గురువారం నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ నులిపురుగుల నివారణపై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కలిసి ప్రజలకు అవగాహ కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో ప్రశాంత్, భాస్కర్, ఇమ్యూనైజేషన్‌‌ ఆఫీసర్లు రవీందర్‌‌ గౌడ్‌‌, శ్రీతేజ, జైపాల్‌‌రెడ్డి, రహమాన్, ప్రభాకర్‌‌ పాల్గొన్నారు. 

వెంకటాపూర్‌‌లో...

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ జడ్పీ హైస్కూల్‌‌లో గురువారం డీఎంహెచ్‌‌వో అప్పయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్లకు ఆల్బెండజోల్‌‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌‌సీ వైద్యాధికారి శ్రీకాంత్, కమ్యూనిటీ హెల్త్‌‌ ఆఫీసర్‌‌ సదానందం, పీహెచ్‌‌ఎన్‌‌ శోభ, హెడ్‌‌మాస్టర్‌‌ బాబురావు ఉన్నారు.