లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ

లక్షెట్టిపేట,  వెలుగు : సమాజ సేవ చేయడంలో రోటరీ క్లబ్ ముందుంటుందని క్లబ్​ జిల్లా గవర్నర్ బుసిరెడ్డి శంకర్ రెడ్డి అన్నారు. గురువారం లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మండలంలో ఇప్పటివరకు ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలను చేపట్టారని మండల కమిటీని కొనియాడారు.