హైదరాబాద్ గాంధీభవన్ ల సందడి నెలకొంది. ఇప్పటి వరకు ప్రకటించిన 100 మంది అభ్యర్థులకు బీఫామ్ ఇస్తున్నారు. గాంధీ భవన్ లో AICC కార్యదర్శి విశ్వనాథ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థులకు బీ ఫాంలు పంపిణీ చేస్తున్నారు.
చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేష్ మొదటి బీ ఫాం తీసుకున్నారు. సిర్పూర్ అభ్యర్థి రవి శ్రీనివాస్ బీ ఫాం పొందారు. నిర్మల్ అభ్యర్థి శ్రీహరి రావు తరపున ఆయన కూతురు బీ ఫాం తీసుకున్నారు.
ALSO READ : నవంబర్ 12న తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
సికింద్రాబాద్ కంట్మోనెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ కూతురు వెన్నెల బీ ఫాం అందుకున్నారు. కాగా కాంగ్రెస్ మిగిలిన 19 మందితో నేడు తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.