
కరీంనగర్ టౌన్,వెలుగు: ఈనెల 17న భద్రాచలంలో జరగనున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందజేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ మేరకు రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలంబ్రాలు కావల్సినవారు 18లోగా బుక్ చేసుకుని, లాజిస్టిక్ మేనేజర్ సదాశివ్ కు వివరాలు ఇవ్వాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవినాశ్, జగన్ పాల్గొన్నారు.