కారేపల్లి, వెలుగు : మండలంలోని విశ్వనాథపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి అదే గ్రామానికి చెందిన షేక్ పెద్ద షరీఫ్ కుర్చీలను బుధవారం వితరణ చేశారు. షేక్ పెద్ద షరీఫ్ తన తండ్రి నవాబ్ జ్ఞాపకార్థం కుర్చీలను ఉప కేంద్రం డాక్టర్ మహేశ్వరికి అందజేశారు.
ఈ సందర్భంగా షరీఫ్ ను విశ్వనాథపల్లి గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వల్లభనేని ప్రభాకర్ రావు, తాతా వెంకటేశ్వర్లు, వల్లభనేని మురళీ, ఏఎన్ఎం అంజలీ తదితరులు పాల్గొన్నారు.