కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో పాస్టర్లకు దుస్తులు పంపిణీ

జనగామ అర్బన్, వెలుగు : కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. పట్టణంలోని డీసీసీ ఆఫీస్‌‌లో జరిగిన కార్యక్రమంలో కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వేమళ్ల సత్యనారాయణరెడ్డి, చెంచారపు శ్రీనివాస్‌‌రెడ్డి, సర్వల నర్సింగరావు, వంగాల మల్లారెడ్డి, బనుక శివరాజ్, పాస్టర్లు నల్లజాన్, ప్రభాకర్, సామ్యూల్, నర్సింగ్, మోజస్‌‌, సంజీవ పాల్గొన్నారు.