మద్దూరు, వెలుగు: మండలంలోని జాదవ్ రావ్ పల్లి గ్రామానికి చెందిన తలారి భీమేశ్ కు రూ.1.57 లక్షలు, ఎక్కమేడ్ గ్రామానికి చెందిన మౌనికకు రూ.37 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పీఏసీఎస్ చైర్మన్ నర్సింలు అందజేశారు.
ఆర్థికసాయం అందించడంతో బాధితులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం ఎంత బిజీగా ఉన్నా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. లీడర్లు అశోక్ గౌడ్, రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.