హైదరాబాద్ సిటీ, వెలుగు : జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్గురువారం డబుల్బెడ్రూమ్ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. బుధవారం హైదరాబాద్కలెక్టరేట్ లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వెంకటాచారి సమావేశం నిర్వహించారు.
ముషీరాబాద్ నియోజవర్గంలోని బాకారానికి చెందిన 37 మంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్ కు చెందిన 44 మందికి పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, 3 పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలతో కలెక్టరేట్ కు రావాలని సూచించారు. సమావేశంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, కలెక్టరేట్ ఏఓ సదానందం పాల్గొన్నారు.