అక్టోబర్ నాటికి 65 వేల ఇండ్లు ఇస్తం : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆగస్టు మొదటి వారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావివ్వొద్దని, అర్హులకు మాత్రమే ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఇండ్ల పంపిణీపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు గ్రేటర్‌పరిధిలోని కలెక్టర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ మూడో వారం వరకు ఇప్పటికే పూర్తి చేసిన 65 వేలకు పైగా ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. సీఎం నిర్ణయించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.
క్రియేటివిటీని వెలికి తీసేందుకే ఫౌండర్స్ ల్యాబ్
స్టూడెంట్లలో క్రియేటివిటీని వెలికి తీసేందుకు, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఫౌండర్స్‌ల్యాబ్ ఉపయోగ పడుతుందని మంత్రి కేటీఆర్అన్నారు. బుధవారం హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ ఆఫీస్‌లో ఆ సంస్థను కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోని యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. యువతను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం టీ హబ్, టీ వర్క్స్, అగ్రి హబ్, వీ హబ్‌లాంటి అనేక వేది కలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కాలేజీ స్థాయి నుంచే స్టూడెంట్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఫౌండర్స్ల్యాబ్ద్వారా ట్రైనింగ్ఇస్తామని మంత్రి చెప్పారు. ఫార్మా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్రంగాలను ఇంజినీరింగ్‌తో అనుసంధానం చేసి ఆవిష్కరణలు చేస్తామని ఫౌండర్స్ ల్యాబ్ సీఈవో శకుంతల కాసరగడ్డ తెలి పారు.